SR & BGNRకి యూనివర్సిటీ హోదా ఇవ్వాలి

ఖమ్మంలోని SR & BGNR ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీని యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. 1956లో స్థాపించబడిన ఈ కాలేజీ.. 1976లో ఏర్పాటైన కాకతీయ యూనివర్సిటీ కంటే సుమారు 20 ఏళ్ల ముందే విద్యాసేవలు ప్రారంభించింది. ఈ చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలేజీని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలని విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.



