← Back to news

విద్యుత్ కార్మికులను సంస్థలో విలీనం చేయాలి

By BUJJIBABU· 1d ago· Salivahanapeta, Mangalagiri, Guntur

గుంటూరు బ్రాడీపేటలోని సీఐటీయూ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం జరిగింది. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి నాగరాజు మాట్లాడారు. విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రూ.48 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 21న విజయవాడ నుంచి తిరుపతి వరకు బైక్ జాత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

More in Local