← Back to news

యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

By DK· 7h ago
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా నాచారం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మల్లాపూర్‌ అన్నపూర్ణ కాలనీలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గణేష్‌ ఉత్సవాలను పురస్కరించుకుని మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ‘గణేష్‌ సురక్ష సంకల్ప్‌–2026’లో భాగంగా పంచముఖి ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. అడిషనల్‌ డీసీపీ వెంకట రమణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గణేష్‌ ఉత్సవ నిర్వాహకులు, యువత, స్థానికులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వ్యసన నివారణపై పోలీసులు అవగాహన కల్పించారు.

More in Local