ఆ గెస్ట్‌హౌస్ సంగతేంటో ఏంటో తేల్చాలి: RS ప్రవీణ్
TG: హైదరాబాద్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త కె.శోభారెడ్డి చేసిన పబ్లిక్ కంప్లైంట్‌పై రాజకీయంగా స్పందనలు వస్తున్నాయి. అడ్వర్టైజింగ్ కంపెనీలో ఛాన్స్ ఇవ్వాలని కోరినందుకు CM దగ్గర వ్యక్తి గెస్ట్‌హౌస్‌కు రావాలని పిలిచారని ఆమె ఆరోపించినట్లు BIG TV మాజీ ఉద్యోగి <a href="https://www.theclearcutnews.com/n/T4DraDA">అశోక్ SMలో పోస్ట్ చేశారు.</a> దీనిపై RS ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. ‘ఇంత ఘోరమా! అసలు ఆ CM సన్నిహితుడు ఎవరో కనిపెట్టాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి ఈ గెస్ట్‌హౌస్ ఏంటో తేల్చాలి. బాధిత మహిళతో మాట్లాడి ఆమె కన్నీళ్లు తుడవాలి’ అని అన్నారు.


