రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత

ప్రమాదంలో కాలు కోల్పోయిన బీజేపీ కార్యకర్త కుటుంబానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కర్నే గ్రామానికి చెందిన రాజు యాదవ్ కొన్నేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోయారు. బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి తన వంతు సహాయంగా రూ.10,000 అందించారు. ఈ మొత్తాన్ని బీజేపీ మక్తల్ రూరల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శులు సురేష్, జనార్ధన్ రాజు యాదవ్ కుటుంబానికి అందజేశారు.



