నీటి ఎద్దడి.. పంటల సంరక్షణపై అవగాహన

ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు గ్రామంలో మంగళవారం ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం, నీటి ఎద్దడి పరిస్థితులపై రైతులతో చర్చించారు. రాబోయే రబీ సీజన్ పంటలకు చేపట్టాల్సిన సస్య సంరక్షణ చర్యలపై వ్యవసాయ అధికారులు రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు (ADA) సి. భవాని, అనిగండ్లపాడు సొసైటీ అధ్యక్షులు అత్తులూరి అచ్యుతరావు, గ్రామ VAA, VHAలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



