← Back to news

పోలవరం జిల్లా నూతన ఎస్పీగా కే చక్రవర్తి

By MD ALI· 1d ago· Chatti, Chinturu, Polavaram
పోలవరం జిల్లా నూతన ఎస్పీగా కే చక్రవర్తి

పోలవరం జిల్లాకు పూర్తిస్థాయి ఎస్పీగా కే. చక్రవర్తిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు సీఐడీ ఎస్పీగా ఉన్న ఆయనకు పోలవరం ఎస్పీగా బాధ్యతలు అప్పగిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా ఏర్పడి తొమ్మిది నెలలు అయినా పూర్తిస్థాయి ఎస్పీ లేకపోవడంతో అల్లూరి జిల్లా ఎస్పీ అమిత్‌ భర్దర్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగారు. పోలవరం ఓఎస్డీ పంకజ్‌ కుమార్‌ మీనాను మార్కాపురం ఎస్పీగా బదిలీ చేశారు.

More in Local