← Back to news

బెంగాల్‌లో ఈసీ సంచలన నిర్ణయం.. నియోజకవర్గం మొత్తం రీ పోలింగ్

By aravinda nyayapati· 3 May 2026· Kolkata
బెంగాల్‌లో ఈసీ సంచలన నిర్ణయం..  నియోజకవర్గం మొత్తం రీ పోలింగ్

పశ్చిమ బెంగాల్‌లో ఈసీ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఫాల్టా నియోజకవర్గంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగిందన్న ఆరోపణలతో మొత్తం 285 పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మే 21న మళ్లీ పోలింగ్ నిర్వహించి మే 24న ఫలితాలు వెల్లడిస్తుంది. మిగిలిన నియోజకవర్గాల్లో యధావిధిగా రేపే కౌంటింగ్ ఉంటుంది. టీఎంసీ, బీజేపీ మధ్య హింసాత్మక ఘటనలు , ఆందోళనలు జరగడంతో ఈసీ నిర్ణయం తీసుకుంది.

More in India