'దాచేపల్లిలో ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ'

పల్నాడు జిల్లా దాచేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ 2.0 పథకం కింద ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. గురజాల, దాచేపల్లి నగర పంచాయతీల పరిధిలోని అర్హులకు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పత్రాలు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.


