← Back to news

పొట్లూరులో కార్డెన్ సెర్చ్.. 54 వాహనాలు సీజ్

By Karimulla Shaik· 25 Aug 2026· Palnadu
పొట్లూరులో కార్డెన్ సెర్చ్.. 54 వాహనాలు సీజ్

AP: గుంటూరు రేంజ్ ఐజీ ఆదేశాల మేరకు నరసరావుపేట సబ్‌డివిజన్ పరిధిలోని శావల్యాపురం మండలం పొట్లూరులో డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు సరైన ధ్రువపత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై నిఘా కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే అసత్య, నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

More in Local