హామీలు అమలు చేయకపోతే ఊరుకోం: శ్రీనివాస్ గౌడ్

TG: ఆటో కార్మికులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సాయం వెంటనే అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ పట్టణంలోని మెట్టుగడ్డలో నిర్వహించిన ఆటో కార్మికుల నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. సంవత్సరానికి రూ.12 వేల చొప్పున రెండేళ్లకు రూ.24 వేలు వెంటనే చెల్లించాలని కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.



