జెడ్ జోగంపేటలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ పరిధిలోని జెడ్ జోగంపేటలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. మండలంలోని జీలుగులోవ, పశువులబండ మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని అటవీ ప్రాంతంలో సుమారు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన యాత్ర నిర్వహించారు. మారుమూల ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జోగంపేట కేంద్రంగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని, రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు.


