మచిలీపట్నం–కర్నూలు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలు

AP: రద్దీని దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నం–కర్నూలు సిటీ మధ్య కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వారానికి 3 రోజులు ఈ సర్వీస్ నడుస్తుంది. సోమ, బుధ, శనివారాల్లో మచిలీపట్నం నుంచి కర్నూలుకు, మంగళ, గురు, ఆదివారాల్లో కర్నూలు నుంచి మచిలీపట్నానికి రైలు అందుబాటులో ఉంటుంది. విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, మార్కాపురం, నంద్యాల, డోన్ సహా పలు స్టేషన్లలో స్టాప్‌లు ఉంటాయి. కోస్తాంధ్ర–రాయలసీమ ప్రయాణికులకు ఇది ట్రావెల్ కనెక్టివిటీ పెంచుతుంది.



