స్వల్పంగా పెరిగిన బంగారం రేట్లు.. ధరలు ఇలా ఉన్నాయి!

వరుసగా 3–4 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు కాస్త పెరిగాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. ఈరోజు ఉ. 6 గం. సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,61,140గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రా. ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,47,710గా నమోదైంది. ఇక వెండి ధర హైదరాబాద్, విజయవాడలో ప్రస్తుతం కిలో వెండి రూ.2,64,900గా ఉంది. గత కొన్ని రోజులుగా గోల్డ్ రేట్లు తగ్గడంతో కొనేవారికి కాస్త రిలీఫ్ వచ్చింది.. అయితే బంగారం కొనేవారు ఎప్పటికప్పుడు రేట్లను చెక్ చేసుకోవడం మంచిది.



