ఏపీ హైకోర్టు కీలక తీర్పు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టివేసింది. న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, మొత్తం రిజర్వేషన్లు 50శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు ఈ జీవోలు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. బీసీల జనగణన పూర్తయ్యాకే ఎన్నికలు పెట్టాలన్న పిటిషన్‌ను కూడా ధర్మాసనం కొట్టివేసింది.



