← Back to news

జగిత్యాలలో పాల కేంద్రాలపై తనిఖీలు

By DK· 5h ago
జగిత్యాలలో పాల కేంద్రాలపై తనిఖీలు

జగిత్యాల పట్టణంలోని పలు పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష నేతృత్వంలో ఈ తనిఖీలు జరిగాయి. ఇటీవల చైతన్య డైరీ పాల ప్యాకెట్‌లో గమ్‌ వంటి అనుమానాస్పద పదార్థం వచ్చిందంటూ ఓ వినియోగదారుడు ఫిర్యాదు చేయడంతో అధికారులు స్పందించారు. చైతన్య డైరీ ఫారంతో పాటు పట్టణంలోని పలు ప్రధాన పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. వివిధ కేంద్రాల నుంచి పాల నమూనాలను సేకరించి నాణ్యతా పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌కు పంపించారు.

More in Local