సూర్యాపేట-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదం

సూర్యపేట- ఖమ్మం జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోతె గ్రామం వద్ద ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లోపల ఉన్న డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.



