ఖమనలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమన గ్రామపంచాయతీలో అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ లహుకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందుతాయని వారు తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీలాష్, జీపీఓ రాజేశ్వర్, గ్రామస్తులు పాల్గొన్నారు.



