← Back to news

మహిళల ప్రత్యేక గణపతి.. నిమజ్జనం కూడా వాళ్లే!

By Adithya· 1d ago· Ranga Reddy
మహిళల ప్రత్యేక గణపతి.. నిమజ్జనం కూడా వాళ్లే!

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని జానంపేట గాంధీ చౌక్‌లో ఈసారి వినాయక చవితి వేడుకలు కాస్త స్పెషల్‌గా జరిగాయి. సాధారణంగా కాలనీ పెద్దలు, యువకులు విగ్రహాలు పెడుతుంటారు. కానీ ఇక్కడ మహిళలంతా కలిసి ప్రత్యేకంగా గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఇవాళ పూజలు చేసిన తరువాత మహిళలే స్వయంగా విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి బొబ్బిలి చెరువులో నిమజ్జనం చేశారు.

మహిళల ప్రత్యేక గణపతి.. నిమజ్జనం కూడా వాళ్లే!

More in Local