డిప్యూటీ సీఎం భట్టికి స్వాగతం పలికిన నాయకులు
నాగర్కర్నూల్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననూర్లో ఘన స్వాగతం లభించింది. ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్తో పాటు పలువురు అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా భట్టి విక్రమార్క పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.


