CECపై షర్మిల ఫైర్.. రాజీనామా డిమాండ్
AP: ఓటు వ్యవస్థను ప్రధాని మోదీ, CEC జ్ఞానేష్ కుమార్‌ను అడ్డుపెట్టి భ్రష్టు పట్టించారని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ YS షర్మిల ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ఫెయిర్‌గా పనిచేసి ప్రజలు కోరుకున్న నాయకుడిని ఎన్నుకునేలా చేయాలని అన్నారు. 13 కోట్ల ఓట్ల తొలగింపు దేశద్రోహ చర్యతో సమానమని, CEC వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తొలగించిన ఓట్లను వెంటనే మళ్లీ చేర్చాలని, ప్రధాని మోదీ, అమిత్ షా పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

