← Back to news

వినయ్‌ అవయవదానం.. ఐదుగురికి ప్రాణదానం

By Bala· 1d ago
వినయ్‌ అవయవదానం.. ఐదుగురికి ప్రాణదానం

కామారెడ్డికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కుడిక్యాల వినయ్‌ (26) అవయవదానంతో ఐదుగురికి కొత్త జీవితం లభించింది. ఈ నెల 16న బ్రెయిన్ ట్యూమర్ కారణంగా ఇంట్లో కుప్పకూలిన వినయ్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్య బృందం అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించారు. కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులను సేకరించి అవసరమైన వారికి అమర్చినట్లు అధికారులు తెలిపారు.

More in Local