← Back to news

అర్హులైన మహిళలకు ఉద్యోగ అవకాశం

By Kamal Kumar· 2h ago· Vikarabad, Vikarabad, Vikarabad
అర్హులైన మహిళలకు ఉద్యోగ అవకాశం

వికారాబాద్ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 264 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఇందులో 102 టీచర్, 162 ఆయా పోస్టులు ఉన్నాయి. అర్హులైన మహిళలు అక్టోబర్ 24 సాయంత్రం 5 గంటల్లోగా https://wdcw.tg.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ధ్రువీకరించిన పత్రాలను అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 వరకు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాల్లో అందజేయాలి.

More in Local