రోడ్లు గుంతలు పడ్డాయా.. ఫొటో పంపండి

AP: రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న టైమ్‌లో ఏలూరు పోలీసులు కీలక సూచనలు చేశారు. రోడ్డు పనులు జరుగుతున్న చోట బ్యారికేడ్లు, వార్నింగ్ బోర్డులు లేకపోతే ఫొటో తీసి ఏలూరు పోలీసుల WhatsApp నంబర్ 9550351100కు పంపాలని SP సూచించారు. కాంట్రాక్టర్లు సేఫ్టీ ఏర్పాట్లు పట్టించుకోకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు హెల్మెట్ ధరించి, స్పీడ్ తగ్గించి జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని SP తెలిపారు.



