ప్రతి విఫల వివాహాన్ని నేరంగా మార్చకూడదు: హైకోర్టు

ప్రతి విఫల వివాహాన్ని నేరంగా మార్చకూడదు అని అలహాబాద్ హైకోర్టు చెప్పింది. ఇటీవల ఒక డౌరీ కేసును రద్దు చేస్తూ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. సమస్యలున్న లేదా విడిపోయిన వివాహాన్ని క్రిమినల్ కేసుగా మార్చడం సరికాదని పేర్కొంది. ఇలా చేస్తే వివాహ సంస్థకు మూలాలు దెబ్బతింటాయని చెప్పింది. పెళ్లి కేవలం ఇద్దరి మధ్య ఒప్పందం మాత్రమే కాదని, అది సమాజ స్థిరత్వానికి పునాది కూడా అని వివరించింది.

