సంకల్పం ముందు..వైకల్యం ఎంత!
సంకల్పం అనే బలం ముందు వైకల్యం ఎంత అని నిరూపించింది బిహార్‌లోని కటిహార్‌కు చెందిన 13 ఏళ్ల లక్ష్మి. రెండు చేతులు లేని తను తన కాలి వేళ్ల మధ్య పెన్ను పట్టుకొని రాయడం నేర్చుకుంది. చదువు మీద ఇష్టంతో హసన్‌గంజ్ ప్రఖండంలోని స్కూల్లో నాలుగో తరగతి చదువుతోంది. తనే తన పనులు సొంతంగా చేసుకుంటుంది. ఆమె తల్లిదండ్రులు కూలీ పని చేసి ఆమెను చదివిస్తున్నారు. టీచర్ కావాలన్నది లక్ష్మి కల. ఆరోగ్య శాఖ ఆమెకు 100% దివ్యాంగత్వ సర్టిఫికెట్ ఇచ్చింది. సామాజిక సంక్షేమ శాఖ తనకు సాయం అందించేందుకు ముందుకొచ్చింది.



