← Back to news

87 ఏళ్ల వయసు.. ఆరేళ్లుగా అందని కుటుంబ పింఛన్

By SHAIK SUBHANI· 4d ago
87 ఏళ్ల వయసు.. ఆరేళ్లుగా అందని కుటుంబ పింఛన్

గుంటూరు జిల్లాకు చెందిన రిటైర్డ్ ఎస్‌టీఓ ఎం.డి. అన్వర్‌ఉల్లా బేగ్ భార్య రహమతున్నిసా బేగంకు ఇప్పుడు 87 ఏళ్లు. 19 ఏళ్లుగా తనకు రావాల్సిన కుటుంబ పింఛన్ బకాయిల కోసం ఆరేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా సమస్య పరిష్కారం కావడం లేదు. 2020 ఫిబ్రవరిలో మొదటిసారి స్పందన కార్యక్రమంలో అధికారులకు తన సమస్య విన్నవించారు. నేటికీ ఆమె సమస్యకు పరిష్కారం రాలేదు. దీంతో మరోసారి గుంటూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి తన సమస్య వివరించేందుకు వచ్చారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 1h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.