DJ విషయంలో గొడవ.. తలకు గాయాలు
AP:వైజాగ్ లో అర్ధరాత్రి యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. శనివారం రాత్రి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరలోని క్యూబా పబ్లో మద్యం సేవించిన రెండు గ్రూపుల మధ్య డీజే సౌండ్, డ్యాన్స్ విషయంలో గొడవ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బౌన్సర్లు వారిని బయటకు పంపడంతో రోడ్డుపై కూడా బీర్ బాటిళ్లు, హెల్మెట్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఇద్దరికి తలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులకు ఇన్ఫార్మ్ చేసిన ఆలస్యంగా వచ్చారని చెప్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

