చిన్నవడ్లపూడిలో ఉచిత యోగా శిక్షణ ప్రారంభం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చిన్నవడ్లపూడిలోని వలివేటి వాసుదేవరావు కమ్యూనిటీ హాల్లో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభమైంది. పెదవడ్లపూడి మాజీ సర్పంచ్ అన్నే చంద్రశేఖర్, సీనియర్ యోగా సాధకురాలు పద్మలత దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆధునిక జీవన విధానంలో పెరుగుతున్న ఒత్తిడిని అధిగమించేందుకు యోగా, ధ్యానం అవసరమని అన్నారు.



