← Back to news

డీ-17 కాల్వకు నీరు బంద్‌.. రైతుల ఆందోళన

By Srinivas· 1d ago
డీ-17 కాల్వకు నీరు బంద్‌.. రైతుల ఆందోళన

TG: నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలో కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ డీ-17 కాల్వ ద్వారా నీరు అందకపోవడంతో పెద్దాపురం, లక్ష్మాపురం, మామిళ్లపల్లి గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. కాల్వలో మట్టి, పెద్ద బండరాళ్లు పేరుకుపోవడంతో నీరు ముందుకు సాగడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కరించలేదని ఆరోపించారు. నీరు అందకపోతే సుమారు 800 ఎకరాల పంటలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. రైతుల ఆందోళనకు మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కొత్త రవీందర్‌రావు సంఘీభావం తెలిపారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 3h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.