← Back to news

వర్షం పడితే గోడల్లోంచి నీరు.. శిథిలావస్థలో పాఠశాల

By Anil Korkishala· 20h ago· Vellampalle, Tekumatla, Jayashankar Bhupalapally

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లె గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాలలోని గదులన్నీ దెబ్బతినడంతో ప్రస్తుతం ఒక గది మాత్రమే వినియోగంలో ఉంది. ఆ గది పైకప్పు కూడా ఎప్పుడు కూలుతుందోననే ఆందోళన నెలకొంది. వర్షాకాలంలో గోడల నుంచి నీరు వస్తుండటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది. విధిలేని పరిస్థితుల్లో 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న 15 మంది విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు.

More in TG