← Back to news

విద్యుత్ కోతలు ఎత్తివేయాలి: సీపీఎం ధర్నా

By nagaraju· 1d ago· Bommalaramaram, Bommalaramaram, Yadadri Bhuvanagiri
విద్యుత్ కోతలు ఎత్తివేయాలి: సీపీఎం ధర్నా

యాదాద్రి భువనగిరిలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. ప్రజల ఆందోళనలు కూడా పెరిగిపోయాయి. అప్రకటిత విద్యుత్ కోతలు ఎత్తివేయాలని, వ్యవసాయానికి 18 గంటలు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బొమ్మలరామరం ఏఈ కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. జిల్లా నాయకుడు ర్యకల శ్రీశైలం మాట్లాడుతూ, లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో సత్యనారాయణ, నరసింహ, దేవేందర్ రెడ్డి, హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

More in Local