సులువాయిలో మండల స్థాయి కబడ్డీ పోటీలు

కర్నూలు జిల్లా హొళగుంద మండలం సులువాయి గ్రామంలో దసరా సందర్భంగా ఈ నెల 18 నుంచి 21 వరకు మండల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో విజేతలకు అందించే మొదటి బహుమతి ₹20 వేల నగదును టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి ఈ.బి.జి. గోవింద గౌడ్, రాజేంద్ర గౌడ్ అందజేశారు. యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడంతో పాటు సంప్రదాయ క్రీడలను భావితరాలకు అందించాలని వారు సూచించారు.


