నవంబర్ 15 నుంచి సేవా కార్యక్రమాలు
బాపట్ల జిల్లాలోని ఎలైట్ గుడ్ న్యూస్ వెల్ఫేర్ సొసైటీ గుళ్లపల్లి, చెరుకుపల్లి ఆధ్వర్యంలో 2026 నవంబర్ 15 నుంచి సేవా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. పేదలు, అనాథలు, ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, నిరాశ్రయులకు ప్రతిరోజూ ఉచితంగా అన్నదానం చేయాలని సంస్థ నిర్ణయించింది. ఈ సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకొచ్చి సహకారం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. మానవత్వంతో చేసే సేవే దేవుడికి చేసే సేవ అని పేర్కొన్నారు.


