ములుగులో విషాదం.. అక్కాచెల్లెళ్లు మృతి
ములుగు జిల్లా ములుగు మండలం కాసిందేవిపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. పొలం పనుల కోసం తండ్రి అంజద్ పాషా తన ఇద్దరు కుమార్తెలను వెంట తీసుకెళ్లాడు. నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన చిన్న కుమార్తె ఆసియా (9) ప్రమాదవశాత్తు కుంటలో జారిపడింది. ఆమెను కాపాడేందుకు వెళ్లిన పెద్ద కుమార్తె సమిత్ (18) కూడా నీటిలో పడిపోయింది. ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు.



