← Back to news

ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య వారధి ఏపీ ఎన్జీవో: రాజశేఖర్

By SUBHANI· 1d ago· Madugula, Madugula, Anakapalli
ప్రభుత్వం–ఉద్యోగుల మధ్య వారధి ఏపీ ఎన్జీవో: రాజశేఖర్

గుంటూరులో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూరేపల్లి రాజశేఖర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య అసోసియేషన్ వారధిగా పనిచేస్తోందని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి రమణ నాయకత్వంలో రెండు డీఏలు, సరెండర్ లీవ్, పీఆర్సీ కమిషన్ నియామకం, పెన్షనర్ల క్వాంటం పెంపు, సచివాలయ ఉద్యోగుల ఇంక్రిమెంట్లు సాధించామన్నారు. జీవో 57 ద్వారా 11 వేల మందికి సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారే అవకాశం వచ్చిందని తెలిపారు.

More in Local