← Back to news

కొత్త ట్రెండ్… డిజిటల్ డిటాక్స్ హోటల్స్

By AR· 7 Jun 2026
కొత్త ట్రెండ్… డిజిటల్ డిటాక్స్ హోటల్స్

ఫోన్ లేకుండా ఒక్క నిముషం కూడా మనం గడపలేం. దీంతో బుర్రంతా వేడెక్కిపోయి స్ట్రెస్ పెరిగిపోతోంది. అందుకే నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌ వంటి దేశాల్లో డిజిటల్ డిటాక్స్ హోటల్స్ ట్రెండ్ ఊపేస్తోంది. ఈ హోటల్స్‌లోకి అడుగుపెట్టగానే మీ స్మార్ట్‌ఫోన్, లాప్‌టాప్‌లను రిసెప్షన్‌లో లాకర్లలో పెట్టేయాలి. అక్కడ వైఫై ఉండదు, టీవీలు కూడా ఉండవు. కేవలం పుస్తకాలు చదవడం, తోటపని చేయడం, ప్రకృతిని ఆస్వాదించడం మాత్రమే చేయాలి. మొదట్లో కాస్త కష్టంగా అనిపించినా, ఇక్కడికి వచ్చి వెళ్తున్న పర్యాటకులు మానసిక ఒత్తిడి తగ్గి, ప్రశాంతంగా ఉంటోందని చెబుతున్నారు.

More in World