← Back to news

రేపు ధర్మపురిలో విద్యుత్ ఫిర్యాదుల పరిష్కార వేదిక

By Srikanth· 1d ago· Jagitial, Jagitial, Jagitial
రేపు ధర్మపురిలో విద్యుత్ ఫిర్యాదుల పరిష్కార వేదిక

జగిత్యాల జిల్లా ధర్మపురి పాత సబ్‌స్టేషన్‌లో మంగళవారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక (CGRF-II) జరుగుతుంది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ వేదికలో వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవచ్చు. ధర్మపురి, బుగ్గారం, వెల్గటూర్, ఎండపల్లి మండలాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని డీఈ కె. గంగారాం, ఏడీఈ పి. జనార్ధన్ కోరారు.

More in Local