HPS భూమి కేసులో హైకోర్టు కాంటెంప్ట్ నోటీసు!

హైదరాబాద్‌లోని బేగంపేట HPS సొసైటీలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి మాయమైందని ఆరోపణ! హైకోర్టు ఆదేశాలు పాటించకపోవడంతో ఎడ్యుకేషన్ సెక్రటరీకి కాంటెంప్ట్ నోటీసు జారీ అయింది. ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన సందర్భంగా మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గతంలో కోర్టు ఆదేశించింది.. కానీ ఆ ఆదేశాన్ని పాటించలేదు. అందుకే, తాజాగా సిజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసింది.



