రైల్వే స్టేషన్‌లో చావు అంచున ఉన్న ప్రయాణికుడిని కాపాడిన కానిస్టేబుల్ గీత..
ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గీత చేసిన సాహసం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదులుతున్న రైలు ఎక్కబోయి పట్టుతప్పి ప్లాట్‌ఫారమ్, రైలు మధ్య ఖాళీలో పడిపోతున్న ఒక ప్రయాణికుడిని ఆమె మెరుపు వేగంతో స్పందించి పక్కకు లాగారు. కేవలం సెకన్ల వ్యవధిలో గీత సమయస్ఫూర్తి ఆ ప్రయాణికుడి ప్రాణాలను కాపాడింది. ఆమె ధైర్యసాహసాలను చూసి తోటి ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు.

