← Back to news

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: లింగయ్య గౌడ్

By SAIDULU· 1d ago· Suryapet, Suryapet
అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: లింగయ్య గౌడ్

సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం చందుపట్లలోని వెంకటేశ్వర కాలనీలో సోమవారం సాయంత్రం యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదానం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శిగ లింగయ్య గౌడ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానం ప్రారంభమైంది. అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని ఆయన అన్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల 36వ వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాచకొండ సతీష్, శిగ సతీష్, సిగ యుగంధర్ గౌడ్, సిద్ధోజు రమేష్, సిగ సైదులు, శిగ రవి తదితరులు పాల్గొన్నారు.

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: లింగయ్య గౌడ్

More in Local