ఇందిరమ్మ టవర్స్‌కు నేడు శంకుస్థాపన.. లక్ష ఫ్లాట్లే టార్గెట్

TG: హైదరాబాద్‌లో పూర్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. KPHB కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. హైదరాబాద్ పరిధిలో లక్ష ఫ్లాట్ల కన్‌స్ట్రక్షన్ టార్గెట్‌గా, CURE పరిధిలో 12 వేల ఫ్లాట్లను పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్‌లో 18 ప్రాంతాల్లో 7,340 ఫ్లాట్లు కట్టనున్నారు. ఇందుకోసం గవర్నమెంట్ రూ.807.40 కోట్ల అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ శాంక్షన్ చేసింది.



