పెండింగ్ వేతనాల కోసం కార్మికుల సమ్మె

పెండింగ్‌లో ఉన్న పది నెలల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీ సఫాయి కార్మికులు బుధవారం నుంచి విధులు బహిష్కరించి ఏ.ఐ.టి.యు.సి ఆధ్వర్యంలో సమ్మెకు దిగారు. పెండింగ్ వేతనాల సాధనే తమ ప్రధాన లక్ష్యమని కార్మికులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏ.ఐ.టి.యు.సి నాయకులు రాంబాబు మాట్లాడుతూ.. పెండింగ్ వేతనాలతో పాటు కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మున్సిపాలిటీలో సఫాయి కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు.



