← Back to news

బాత్రూం ఉంది.. తాళం తీసేదెప్పుడు?

By Srikanth· 5h ago· Jagitial

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్థంభంపల్లి గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన బాత్రూం డోర్లకు తాళం వేసి ఉండడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన బాత్రూం వినియోగానికి అందుబాటులో లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని తాళాలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.

More in Local