కల్వకుర్తిలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఎల్‌ఐసీ బ్రాంచ్ కార్యాలయంలో సంస్థ 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పట్టణంలోని 13 పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొని వివిధ అంశాలపై వ్యాసాలు రాశారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, రచనా నైపుణ్యాలను ప్రోత్సహించేలా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఎల్‌ఐసీ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ కుమార్, లక్ష్మణాచారి, వినయ్ కుమార్, ఎల్‌ఐసీ ఉద్యోగులు పాల్గొన్నారు.



