← Back to news

పండుగ వేళ ధరల మంట.. సామాన్యుడికి షాక్!

By Anusha· 2h ago
పండుగ వేళ ధరల మంట.. సామాన్యుడికి షాక్!

TG: బతుకమ్మ, దసరా వేళ తెలంగాణలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి పంటల దిగుబడి పడిపోవడంతో బియ్యం, పప్పుల ధరలు ఆకాశాన్నంటాయి. TMT బియ్యం KG ₹65 నుంచి ₹95కు, సోనామసూరి ₹45 నుంచి ₹70కు పెరిగింది. శనగపప్పు ₹76 నుంచి ₹96కు చేరింది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై భారం పెరిగింది. వర్షాలు పడకపోతే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. అక్రమ నిల్వలను అరికడితే ధరలు తగ్గవచ్చు.

More in TG