రోడ్డు ప్రమాదం.. లారీ డ్రైవర్ మృతి

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోమటిపల్లి-మరడాం గ్రామాల మధ్య జాతీయ రహదారి 26పై ఇవాళ తెల్లవారుజామున రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన రవీంద్ర యాదవ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రయాగ మూర్తి తెలిపారు.



