గురజాడ అప్పారావు జయంతి వేడుకలు

కృష్ణా జిల్లా పెడనలోని హైస్కూల్‌లో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఫోటోకి పూలమాల వేసి ప్రిన్సిపాల్ గౌరీ ప్రసాద్ నివాళులర్పించారు. పండితుల రచనలను అందరికీ అర్థమయ్యేలా వాడుక భాషలోకి తెచ్చిన గొప్ప రచయిత గురజాడ అని తెలిపారు. సాంఘిక దురాచారాలపై ఆయన రాసిన 'కన్యాశుల్కం' నాటకం, 'దేశమును ప్రేమించుమన్నా' పాట చాలా ఫేమస్ అని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 21ని స్టేట్ ఫెస్టివల్‌గా డిక్లేర్ చేసింది. ఈ ఈవెంట్‌లో టీచర్ లావణ్య, స్టూడెంట్స్ పాల్గొన్నారు.



