పెళ్లి చూపులకు వెళ్తూ... రోడ్డు యాక్సిడెంట్... ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం దగ్గర ఆదివారం ఓమిని వ్యాన్, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ యాక్సిడెంట్‌లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు హాస్పిటల్‌కు తరలిస్తుండగా మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చెన్నై నుంచి మార్కాపురం పెళ్లిచూపులకు వెళ్తున్న వ్యాన్‌ను, ఒంగోలు నుంచి బద్వేల్ వైపు వెళ్తున్న వాహనం రామాపురం వద్ద ఢీకొట్టింది. స్థానికులు వాహనాల్లో చిక్కుకున్న వారిని పామూరు హాస్పిటల్‌కు తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.





