← Back to news

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

By సురేష్ కుమార్· 9h ago· Khammam

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర ₹.22,200, నాన్ ఏసీ మిర్చి ధర ₹.16,200గా జెండాపాట పలికింది. పత్తి క్వింటా ధర ₹.9,225గా నమోదైంది. మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, గత రోజుతో పోలిస్తే ఏసీ మిర్చి ధర ₹.200 పెరిగింది. నాన్ ఏసీ మిర్చి ధరలో మార్పు లేదు. పత్తి ధర మాత్రం ₹.75 తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు.

More in Local